NEET Paper Leak: నీట్ పేప‌ర్ లీక్ ఆరోప‌ణ‌ల నేపథ్యంలో.. సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌ ఆస‌క్తిక‌ర ట్వీట్‌!

CBI Ex JD Laxminarayana Interesting Tweet on NEET Paper Leak Controversy
  • దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ తదితర మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్‌ పరీక్ష
  • గుజరాత్‌, బీహార్‌లో నీట్ పరీక్ష నిర్వహణలో అక్రమాలు 
  • అక్రమాలు జరిగిన మాట నిజమేనని ఒప్పుకున్న మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌
  •  
నీట్‌ పేప‌ర్ లీక్ అయ్యిందంటూ ఆరోప‌ణ‌లు వ‌స్తున్న వేళ సీబీఐ మాజీ జేడీ, జై భార‌త్ నేష‌న‌ల్ పార్టీ అధ్యక్షుడు ల‌క్ష్మీనారాయ‌ణ‌ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. 'ఒక దేశాన్ని నాశ‌నం చేయాలంటే ఆట‌మ్ బాంబులు అవ‌స‌రం లేదు. నాసిర‌కం విద్య‌, విద్యార్థుల‌ను ప‌రీక్ష‌ల్లో కాపీ కొట్ట‌నివ్వ‌డం లాంటి విధానాల‌ను ప్రోత్స‌హిస్తే ఆ దేశం దానంత‌ట అదే నాశ‌నం అవుతుంది. అలా చ‌దివిన డాక్ట‌ర్ల చేతిలో రోగులు చ‌నిపోతారు అంటూ ప‌లు ఉదాహరణలను  ఓ యూనివ‌ర్సిటీ ప్ర‌వేశ ద్వారం వ‌ద్ద‌ రాశార‌ని' ఆయన పేర్కొన్నారు. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైర‌ల్ అవుతోంది.  

ఇదిలాఉంటే.. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ తదితర మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్‌ యూజీ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలు, ఫలితాల వెల్లడిలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వ‌స్తున్నాయి. నీట్‌లో ఎలాంటి అక్రమాలు జరగలేదని మొదట వాదించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌.. అక్రమాలు జరిగిన మాట నిజమేనని తాజాగా అంగీక‌రించారు. నీట్‌ అక్రమాలు గుజరాత్‌, బీహార్‌లో వెలుగుచూడటం.. అక్కడ ఎన్‌డీఏ కూటమి ప్రభుత్వాలే అధికారంలో ఉండటం రాజకీయంగానూ చర్చనీయాంశమవుతోంది.
NEET Paper Leak
Twitter
VV Lakshminarayana

More Telugu News