Lockie Ferguson: ప్ర‌పంచ క్రికెట్‌లో పెను సంచ‌ల‌నం.. కివీస్ బౌల‌ర్ లూకీ ఫెర్గూస‌న్ స‌రికొత్త‌ రికార్డ్‌!

Lockie Ferguson Bowls Most Economical Spell in T20 World Cup History
  • తరుబా వేదిక‌గా పాపువా న్యూ గినియా, న్యూజిలాండ్ మ్యాచ్‌
  • 4కి 4 ఓవ‌ర్లు మెయిడిన్ వేసి 3 వికెట్లు తీసిన‌ లూకీ ఫెర్గూస‌న్
  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో 4 ఓవ‌ర్లు మెయిడిన్ వేసిన తొలి బౌల‌ర్‌గా ఘ‌న‌త‌
  • టీ20ల్లో ఫెర్గూస‌న్ కంటే ముందు ఈ ఫీట్‌ను అందుకున్న కెన‌డాకు చెందిన సాద్ బిన్ జ‌ఫ‌ర్ 
  • పీఎన్‌జీపై కివీస్ 7 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం
ప్ర‌పంచ క్రికెట్‌లో పెను సంచ‌ల‌నం న‌మోదైంది. న్యూజిలాండ్ బౌల‌ర్ లూకీ ఫెర్గూస‌న్ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ చ‌రిత్ర‌లో స‌రికొత్త రికార్డు నెల‌కొల్పాడు. ఫెర్గూస‌న్ 4 ఓవ‌ర్లు వేసి ఒక్క ర‌న్ కూడా ఇవ్వ‌లేదు. 4కి 4 ఓవ‌ర్లు మెయిడిన్ వేశాడు. అంతేగాక 3 వికెట్లు కూడా ప‌డ‌గొట్టాడు. 

అంత‌ర్జాతీయ టీ20ల్లో అత్యుత్త‌మ గ‌ణాంకాలు ఇవే. అలాగే టీ20 ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో ఇలా 4 ఓవ‌ర్లు మెయిడిన్ వేసిన తొలి బౌల‌ర్‌గా కూడా ఫెర్గూస‌న్ నిలిచాడు. పాపువా న్యూ గినియాతో జ‌రిగిన మ్యాచులో కివీస్ ఈ న‌యా రికార్డు అందుకున్నాడు. గ‌తంలో కెన‌డాకు చెందిన సాద్ బిన్ జ‌ఫ‌ర్ కూడా 4 మెయిడిన్ ఓవ‌ర్లు వేసి 2 వికెట్లు తీశాడు. 

కివీస్‌కు ఓదార్పు విజ‌యం
ఇక పాపువా న్యూ గినియాతో జ‌రిగిన ఈ మ్యాచులో కివీస్ 7 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పీఎన్‌జీని ఫెర్గూస‌న్ ఘోరంగా దెబ్బతీశాడు. దీంతో ఆ జ‌ట్టు 78 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. 

ఛేద‌న‌లో న్యూజిలాండ్ మూడు వికెట్లు కోల్పోయి ల‌క్ష్యాన్ని అందుకుంది. ఇక ఇప్ప‌టికే ఈ రెండు జ‌ట్లు టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ నుంచి నిష్క్ర‌మించిన సంగ‌తి తెలిసిందే. ఈ విజ‌యంతో గ్రూప్‌-సీలో న్యూజిలాండ్ మూడో స్థానంతో త‌న ప్ర‌స్థానాన్ని ముగించింది. ఇటీవ‌ల కాలంలో అద్భుత‌మైన క్రికెట్ ఆడుతున్న కివీస్‌.. ఐసీసీ ఈవెంట్‌లో ఇలా నాకౌట్‌కు చేర‌కుండా వెనుదిరగ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.
Lockie Ferguson
Most Economical Spell
T20 World Cup History
T20 World Cup 2024
Cricket
Sports News

More Telugu News