Seethakka: హత్యాచారానికి గురైన బాలిక కుటుంబానికి రూ.50 వేలు అందించిన మంత్రి సీతక్క

Minister Seethakka visits miyapur incident victims family
  • కూలి పనుల కోసం మహబూబాబాద్ జిల్లా నుంచి మియాపూర్ వచ్చిన కుటుంబం
  • ఇంటి నుంచి బయటికి వెళ్లిన బాలిక అదృశ్యం
  • అదే వీధిలో చెత్తకుప్పలో శవమై కనిపించిన వైనం
  • అత్యాచారం చేసి చంపేసి ఉంటారని భావిస్తున్న పోలీసులు
మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ బాలిక ఇటీవల మియాపూర్ లో హత్యాచారానికి గురికావడం తెలిసిందే. లక్ష్మ తండాకు చెందిన నరేశ్, శారద దంపతులు మూడు వారాల కిందట కూలి పనుల కోసం హైదరాబాద్ లోని మియాపూర్ వచ్చారు. వారి కుమార్తె (12) ఇంటి నుంచి కిరాణా దుకాణానికి వెళ్లి తిరిగి రాలేదు. అయితే అదే వీధిలో ఓ చెత్త కుప్పలో ఆ బాలిక విగత జీవురాలిగా కనిపించింది. బాలికను అత్యాచారం చేసి చంపి ఉంటారని భావిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో, మంత్రి సీతక్క మహబూబాబాద్ జిల్లాలో నేడు అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు. బాలిక తల్లిదండ్రులకు రూ.50 వేల సాయం అందించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
Seethakka
Miyapur Incident
Mahabubabad District
Congress
Telangana

More Telugu News