Vijayasai Reddy: కువైట్ మృతుల కుటుంబాలకు చంద్రబాబు ప్రకటించిన రూ.5 లక్షలు సరిపోవు... అప్పట్లో జగన్ రూ.1 కోటి ఇచ్చారు: విజయసాయిరెడ్డి

Viajayasai Reddy slams Chandrababu on compenesation for Kuwait fire accident victims
  • ఇటీవల కువైట్ లో ఘోర అగ్నిప్రమాదం
  • మృతుల్లో ముగ్గురు ఏపీ వాసులు
  • రూ.5 లక్షల చొప్పున సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు
  • బాధితులను అవమానించడమేనన్న విజయసాయిరెడ్డి
ఇటీవల కువైట్ లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 45 మంది భారతీయులు చనిపోగా, అందులో ముగ్గురు ఏపీ వాసులు ఉన్నారు. మృతుల కుటుంబాలకు ఏపీ నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.5 లక్షల చొప్పున సాయం ప్రకటించారు. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. 

కువైట్ అగ్నిప్రమాద మృతుల కుటుంబాలకు చంద్రబాబు నాయకత్వంలోని ఏపీ ప్రభుత్వం ప్రకటించిన రూ.5 లక్షలు ఏ మూలకు సరిపోవని, అంత తక్కువ మొత్తంలో సాయం ప్రకటించడం వారిని అవమానించడమేనని విమర్శించారు. నాడు విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీక్ ఘటన మృతుల కుటుంబాలకు జగన్ రూ.1 కోటి చొప్పున పరిహారం అందించారని విజయసాయిరెడ్డి గుర్తుచేశారు. 
Vijayasai Reddy
Chandrababu
Kuwait
Jagan
Visakha LG Polymers
YSRCP
TDP

More Telugu News