Chandrababu: ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ పోస్టర్ ఆవిష్కరించిన ఏపీ సీఎం చంద్రబాబు

Chandrababu launches Kalavedika NTR Film Awards poster
  • సినీ రంగంలో ప్రతిభావంతులకు కళావేదిక పురస్కారాలు
  • జూన్ 29న హైదరాబాదులో అవార్డుల ప్రదానం
  • రాఘవి మీడియా ఆధ్వర్యంలో కార్యక్రమం
  • పోస్టర్ రిలీజ్ చేసి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు
రాఘవి మీడియా సంస్థ కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ పేరిట కొన్నాళ్లుగా సినీ రంగంలోని వివిధ రంగాల ప్రతిభావంతులకు పురస్కారాలు అందజేస్తోంది. ఈసారి జూన్ 29న సాయంత్రం 6 గంటలకు హైదరాబాదులోని దసపల్లా హోటల్ లో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డుల ప్రదానం చేయనున్నారు. 

ఈ నేపథ్యంలో, కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ పోస్టర్ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు ఆవిష్కరించారు. ఇవాళ అమరావతిలో సీఎం చంద్రబాబును రాఘవి మీడియా ప్రతినిధులు కలిశారు. కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ గురించి ఆయనకు వివరించారు. వారు చేస్తున్న ప్రయత్నాన్ని సీఎం చంద్రబాబు మనస్ఫూర్తిగా అభినందించారు. పోస్టర్ ను విడుదల చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు.
Chandrababu
NTR Film Awards
Kalavedika
Raghavi Media
Amaravati
Hyderabad
Tollywood

More Telugu News