Marrying Elder brother Widow: అన్న పోయాక వదినను పెళ్లాడిన యువకుడి హత్య!

Youth shot dead by other siblings for marrying elder brothers widow in Uttarpradesh
  • ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసిన ఘటన
  • అన్న పోయాక వదినను పెళ్లాడిన యువకుడు
  • ఇది ఇతర సోదరులకు నచ్చకపోవడంతో కుటుంబంలో గొడవలు
  • శుక్రవారం ఇదే విషయమై సోదరుల మధ్య గొడవ
  • యువకుడిని కాల్చి చంపిన సోదరులు
అన్న పోయాక వదినను పెళ్లాడిన యువకుడిని అతడి సోదరులే హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో తాజాగా వెలుగు చూసింది. బాగ్‌పత్ గ్రామానికి చెందిన ఈశ్వర్ అనే వ్యక్తికి సుఖ్‌వీర్, ఓంవీర్, ఉదయ్‌వీర్, యశ్‌వీర్ అనే నలుగురు కుమారులున్నారు. గతేడాది సుఖ్‌వీర్ మృతి చెందడంతో అతడి భార్య రితూను యశ్‌వీర్ (32) పెళ్లి చేసుకున్నాడు. ఇది మిగతా సోదరలకు నచ్చకపోవడంతో కుటుంబంలో తరచూ గొడవలు జరగుతుండేవి. 

ఇక ఢిల్లీలో బస్సు డ్రైవర్ గా పనిచేసే యశ్‌వీర్ శుక్రవారం రాత్రి పని ముగించుకుని ఇంటికొచ్చాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న సోదరులు తమ తల్లితో వాగ్వాదానికి దిగారు. యశ్‌వీర్ రాకతో వివాదం మరింత తీవ్రమైంది. దీంతో, విచక్షణ కోల్పోయిన అతడి సోదరులు తుపాకీతో యశ్‌వీర్‌ను కాల్చి చంపారు. కాల్పులకు తెగబడ్డ సోదరులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్టు స్థానిక పోలీసులు తెలిపారు.
Marrying Elder brother Widow
Youth Shot Dead
Uttar Pradesh
Crime News

More Telugu News