Sharad Pawar: మమ్మల్ని గెలిపించిన ప్రధాని మోదీకి థ్యాంక్స్: శరద్ పవార్ చురక

Sharad Pawar Thanks PM Modi for MAV winning
  • మోదీ ర్యాలీలు, రోడ్డుషోలు నిర్వహించిన చోట విజయం సాధించామన్న శరద్ పవార్
  • అందుకే ప్రజలతో పాటు మోదీకి థ్యాంక్స్ చెబుతున్నట్లు వెల్లడి
  • కూటమి గెలుపు ఆరంభమే... అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తామని ధీమా
మహారాష్ట్రలో ప్రధాని నరేంద్రమోదీ ఎక్కడెక్కడైతే ర్యాలీలు, రోడ్డుషోలు నిర్వహించారో అక్కడ... తమ కూటమి మహా వికాస్ అఘాడీ విజయం సాధించిందని ఎన్సీపీ నేత శరద్ పవార్ అన్నారు. తమ కూటమిని అత్యధిక స్థానాల్లో గెలిపించినందుకు ప్రధానికి థ్యాంక్స్ చెబుతున్నానన్నారు. లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు తమ కూటమికి మద్దతిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకు శరద్ పవార్, ఉద్దవ్ ఠాక్రే, పృథ్వీరాజ్ చవాన్ ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా శరద్ పవార్ మాట్లాడుతూ... ప్రధాని రోడ్డు షో నిర్వహించిన ప్రతిచోట తాము గెలిచామన్నారు. అందుకే ప్రజలతో పాటు ప్రధానికీ థ్యాంక్స్ చెప్పడం తమ కర్తవ్యంగా భావిస్తున్నామన్నారు. 'మా గెలుపు కోసం ప్రచారం చేసిన మోదీకి ధన్యవాదాలు' అని పేర్కొన్నారు. కూటమి గెలుపుకు ఇది ఆరంభమేనని... అసెంబ్లీ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
Sharad Pawar
Narendra Modi
BJP
Maharashtra

More Telugu News