Chandrababu: సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి టీడీపీ ఆఫీసుకు వచ్చిన చంద్రబాబు

Chandrababu came TDP office for the first time after takes charge as CM
  • సీఎం హోదాలో ఎన్టీఆర్ భవన్ కు విచ్చేసిన చంద్రబాబు
  • ఘనస్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు
  • ఇక నుంచి ప్రతి శనివారం టీడీపీ ఆఫీసుకు రావాలని చంద్రబాబు నిర్ణయం
  • మంత్రులు తరచుగా జిల్లాల్లోని పార్టీ ఆఫీసులకు వెళ్లాలని ఆదేశం
సీఎం చంద్రబాబు ఈ సాయంత్రం మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయానికి విచ్చేశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఎన్టీఆర్ భవన్ కు చంద్రబాబు రావడం ఇదే ప్రథమం. సీఎం హోదాలో వచ్చిన చంద్రబాబుకు ఘనస్వాగతం లభించింది. పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు జై చంద్రబాబు, జై టీడీపీ అంటూ నినాదాలు చేయడంతో ఎన్టీఆర్ భవన్ మార్మోగిపోయింది. 

ఇక నుంచి ప్రతి శనివారం నాడు పార్టీ కార్యాలయానికి రావాలని చంద్రబాబు నిర్ణయించారు. టీడీపీ మంత్రులు కూడా జిల్లాల్లోని పార్టీ కార్యాలయాలకు తరచుగా వెళుతుండాలని ఆదేశించారు. కాగా, పార్టీ-ప్రభుత్వం సమన్వయం కోసం చంద్రబాబు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. 

అటు, మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు తొలి క్షేత్రస్థాయి పర్యటన పోలవరం సందర్శనే అని వెల్లడించారు. అయితే, పోలవరం సందర్శన ఈ సోమవారమా, వచ్చే సోమవారమా అనేది సీఎం చంద్రబాబు నిర్ణయిస్తారని తెలిపారు.
Chandrababu
NTR Bhavan
TDP Office
Mangalagiri
TDP
Andhra Pradesh

More Telugu News