Prathipati Pulla Rao: జులై 1న అవ్వాతాతలు, దివ్యాంగుల కళ్లలో కొత్త వెలుగులు చూస్తాం: ప్రత్తిపాటి

Prathipati says we can see new lights in the eyes of old aged and disabled persons on July 1
  • రాష్ట్ర గతిని మార్చేలా సీఎం చంద్రబాబు తొలి 5 సంతకాలు చేశారన్న ప్రత్తిపాటి
  • చంద్రబాబు ప్రజల కోసం సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని వెల్లడి
  • రెండున్నరేళ్లలోనే అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని ధీమా
  • మరో 100 రోజుల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభమవుతాయని స్పష్టీకరణ
చిలకలూరిపేట టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర గతిని మార్చేలా సీఎం చంద్రబాబు తొలి 5 సంతకాలు చేశారని కీర్తించారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా చంద్రబాబు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు. 

జులై 1న అవ్వాతాతలు, వికలాంగుల కళ్లలో కొత్త వెలుగులు చూస్తామని ప్రత్తిపాటి పేర్కొన్నారు. మరో 100 రోజుల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. రెండున్నరేళ్లలోనే రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. జే బ్రాండ్ మద్యం దుష్ఫలితాలపై ఊరూరా అధ్యయనం జరగాల్సి ఉందని అన్నారు.
Prathipati Pulla Rao
Chandrababu
TDP
Chilakaluripet
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News