Drinking Water: గ్రామంలోని తాగునీటి ట్యాంకులో పురుగుల మందు.. ఓటమి అక్కసుతోనేనా?

Pestisides Mixed In Drinking Water Tank in Ananthapuram District
  • అనంతపురం జిల్లా తుంబిగనూరు గ్రామంలో ఘటన
  • శుక్రవారం అర్ధరాత్రి ట్యాంకు వద్ద అనుమానితులు
  • గ్రామస్థుల అప్రమత్తతతో తప్పిన ముప్పు
గ్రామం మొత్తానికీ మంచినీరు సరఫరా చేసే ట్యాంకులో గుర్తుతెలియని వ్యక్తులు పురుగుల మందు కలిపారు. ట్యాంకు వద్ద అర్ధరాత్రి దుండగులను గుర్తించిన గ్రామస్థులు అనుమానంతో పరిశీలించగా లిక్విడ్ ఆనవాళ్లు కనిపించాయి. దీంతో అధికారులకు సమాచారం అందించారు. ఇటీవలి ఎన్నికల్లో ఓటమి పాలవడంతోనే గ్రామస్థులపై అక్కసుతో ఈ దారుణానికి తెగబడి ఉంటారని గ్రామస్థులు చెబుతున్నారు. అనంతపురం జిల్లా కనేకల్‌ మండలం తుంబిగనూరు గ్రామంలో చోటుచేసుకుందీ దారుణం.

శనివారం ఉదయం అధికారులు గ్రామానికి విడుదల చేసే తాగునీటి సరఫరాను ఆపేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. గ్రామానికి చేరుకున్న పోలీసులు మంచినీటి ట్యాంకును పరిశీలించారు. శుక్రవారం అర్ధరాత్రి ట్యాంకు దగ్గర ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సంచరించడం గమనించామని, ఎవరు ఏమిటని ప్రశ్నించగా పారిపోయారని గ్రామస్థులు పోలీసులకు తెలిపారు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు.
Drinking Water
Water Tank
pestisides
Anantapur District
Andhra Pradesh

More Telugu News