Hardik Pandya: ఫ్యామిలీ ఎలా ఉంది?.. రికీ పాంటింగ్ ప్రశ్నకు హార్ధిక్ పాండ్యా సమాధానం ఇదే

They are very good says Hardik Pandya on his family
  • అంతా కుశలమేనన్న పాండ్యా
  • భార్య నటాషాతో విడిపోనున్నాడనే ఊహాగానాల నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు
  • టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆసీస్ దిగ్గజం రికీ పాంటింగ్‌తో మాట్లాడిన పాండ్యా
టీ20 వరల్డ్ కప్ ఆరంభానికి ముందు టీమిండియా వైస్ కెప్టెన్, స్టార్ క్రికెటర్ హార్ధిక్ పాండ్యా వ్యక్తిగత జీవితంపై చాలా ఊహాగానాలు వెలువడ్డాయి.  పాండ్యా, అతడి భార్య నటాషా స్టాంకోవిచ్ మధ్య గొడవలు జరుగుతున్నాయని, వారిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని వార్తా కథనాలు గుప్పుమన్నాయి. అయితే ఈ ఊహాగానాలపై దంపతులు స్పందించలేదు. ఈలోగా టీ20 వరల్డ్ కప్ ప్రారంభమైంది. ఫామ్‌లోకి వచ్చిన పాండ్యా అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు.

ఇక టీ20 ప్రపంచ కప్‌‌ ఆడుతూ భారత జట్టుతో పాటు అమెరికాలో ఉన్న హార్ధిక్ పాండ్యా తొలిసారి తన కుటుంబంపై నోరు విప్పాడు. అంతా కుశలమేనని చెప్పాడు. టీ20 ప్రపంచ కప్ నిపుణుడిగా వ్యవహరిస్తున్న ఆసీస్ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్‌తో సంభాషణలో పాండ్యా ఈ విధంగా స్పందించారు. అంతా బాగానే ఉందా? మీ ఫ్యామిలీ ఎలా ఉంది? అని తొలుత పాండ్యా ప్రశ్నించాడు. ‘అందరూ బావున్నారు. చాలా బావున్నారు’ అని సమాధానం ఇచ్చిన పాంటింగ్ మరి నీ సంగతేంటి ఏంటి? అని పాండ్యాను ప్రశ్నించాడు. దీంతో అంతా కుశలమేనని టీమిండియా వైస్ కెప్టెన్ సమాధానం ఇచ్చాడు. వీరిద్దరి సంభాషణకు సంబంధించిన వీడియోను ఐసీసీ తన అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసింది. 

ఇక పాండ్యా భార్య నటాషా ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో తమ పెళ్లి ఫొటోలను తిరిగి అప్‌లోడ్ చేసింది. దీంతో అంతా బాగానే ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. దీంతో పాండ్యా వ్యక్తిగత జీవితం గురించి ఇక మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని పాండ్యా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
Hardik Pandya
Ricky Ponting
Natasa Stankovic
Cricket
T20 World Cup 2024

More Telugu News