తాగిన మత్తులో మహిళ బెర్త్‌పై సైనికుడి మూత్ర విసర్జన

Drunk soldier pees in rail berth wets woman below
తాగిన మత్తులో ఉన్న ఓ సైనికుడు రైలులో ప్రయాణిస్తూ  తన బెర్త్‌పై మూత్ర విసర్జన చేశాడు. ఆ మూత్రం తన బెర్త్‌పై పడిందని ఓ మహిళ ఆరోపించింది. హజ్రత్ నిజాముద్దీన్ నుంచి చత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ వెళ్తున్న గోండ్వానా ఎక్స్‌ప్రెస్ రైలులో జరిగిందీ ఘటన. రైలు గ్వాలియర్ చేరుకుంటుందనగా ఈ ఘటన జరిగినట్టు ఆమె పేర్కొన్నారు. ఈ విషయమై ఆమె రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)కు ఫిర్యాదు చేస్తే వారు పట్టించుకోకపోవడంతో ప్రధానమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేసింది. బాధిత మహిళ తన కుమారుడు, భర్తతో కలిసి బీ-9 కోచ్‌లో ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది.

పై బెర్త్‌లో ఉన్న జవాను మూత్ర విసర్జన చేయడంతో అది మహిళపై పడింది. ఆ వెంటనే ఆమె తన భర్తకు చెబితే ఆయన 139 హెల్ప్ లైన్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశాడు. గ్వాలియర్, ఝాన్సీ స్టేషన్లలో ఆర్పీఎఫ్ సిబ్బంది రైలు ఎక్కినప్పటికీ జవానుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

దీంతో ఆమె ప్రధానమంత్రి కార్యాలయం, రైల్వే మంత్రికి ఫిర్యాదు చేశారు. అయితే, ఆర్ఫీఎఫ్ అధికారులు మాత్రం తాము స్పందించామని, బాధిత మహిళ తన సీట్లో కనిపించలేదని పేర్కొన్నారు. సైనికుడు మాత్రం పూర్తిగా తాగిన మత్తులో నిద్రపోతున్నాడని తెలిపారు.
Go Back to Shorts
Drunk Soldier
Train Berth
Drunk Soldier Pees
Gondwana Express

More Telugu News