TDP: జర్మనీలో ఘనంగా తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు వేడుకలు

TDP NRI celebrates in Germany for TDP alliance victory in AP
  • ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘనవిజయం
  • ప్రపంచవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్న టీడీపీ ఎన్నారైలు
  • జర్మనీలోనూ విజయోత్సవ వేడుక
జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో ఎన్నారై టీడీపీ విభాగం ఆధ్వర్యంలో మినీ మహానాడు ఘనంగా నిర్వహించారు. ఏపీలో విధ్వంసకర పాలన, నియంత పాలనకు చరమగీతం పాడిన నేపథ్యంలో జర్మనీలో ఈ విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కావలి గ్రీష్మతో పాటు జర్మనీ ఎన్నారై టీడీపీ నేతలు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా కావలి గ్రీష్మ మాట్లాడుతూ... ఈ ఎన్నికల్లో ఎన్నారైలు టీడీపీ విజయ కోసం ఎనలేని కృషి చేశారని కొనియాడారు. "ఎన్నారైలు ఎన్నికల ముందు కొన్ని నెలల పాటు ఉద్యోగాలు, కుటుంబాల్ని వదలి రాష్ట్రంలోనే ఉంటూ పార్టీ కోసం పనిచేసిన తీరు అభినందనీయం. 

నియంత జగన్ రెడ్డి సామ్రాజ్యాన్ని నేలమట్టం చేసిన యోధుడు మన అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఐదేళ్ల క్రితం ఎన్నికల్లో కేవలం 23 స్థానాలకు పరిమితమైన దశ నుంచి జగన్‌ వంటి అరాచక, విధ్వంసకర పాలకుడికి ఎదురొడ్డి పోరాడి అద్భుత, అసాధారణ విజయాన్ని మనకు అందించిన ఘనత చంద్రబాబు గారిదే. అభివృద్ధి, సంక్షేమం రెండూ జరగాలని ఆయన కోరుకుంటారు. 

కేవలం రాష్ట్రాభివృద్ధి చెందితే సరిపోదని దేశం కూడా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షిస్తారు. 2014లో ఒకవైపు విభజనతో నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తూ ప్రజలందరికీ సంక్షేమ ఫలాలను అందించిన దార్శనికుడు చంద్రబాబు. 

2019లో తెలుగు ప్రజలు చేసిన ఒక్క తప్పిదానికి ఐదేళ్లు అంధకారంలో ఏపీ మగ్గిపోయింది. నవరత్నాల పేరుతో ల్యాండ్, శాండ్, వైన్, మైన్‌లో ఇష్టారాజ్యంగా జగన్ రెడ్డి ప్రభత్వం దోచుకుంది. రాష్ట్రానికి కొత్తగా ఒక్క పరిశ్రమను తీసుకురాకపోగా ఉన్న పరిశ్రమలను తరిమేశారు. సంక్షేమ పథకాలను అందించకుండానే అందినట్లు చూపించి అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని నెట్టేసిన ఘనత జగన్ రెడ్డిది. 

జగన్ రెడ్డి అరాచక ప్రభుత్వాన్ని భరించలేని ప్రజలు చావు దెబ్బ కొట్టారు. దాంతో వైసీపీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయింది. 11 సీట్ల నుంచి తిరిగి పుంజుకోవడానికి జగన్ రెడ్డి ఏమీ చంద్రబాబు కాదు. 2019లో 175కి కేవలం 23 సీట్లు నెగ్గాం. ఇక టీడీపీ పని అయిపోయిందని ఎవరెవరో విశ్లేషణలు ఇచ్చారు. కానీ గాయపడిన సింహం నుంచి వచ్చే గర్జనలా 164 గెలిచి అఖండ విజయాన్ని సాధించాం. 

ఈ విజయంలో టీడీపీ ఎన్నారై విభాగం కూడా కీలకపాత్ర పోషించడం హర్షణీయం. ఈ విజయం అందరిదీ. జగన్ ప్రభుత్వంలా హింస, విద్వేష రాజకీయాలు, పగలు, ప్రతీకారాలు తీర్చుకునే నీచ ప్రభుత్వం మనది కాదు. అటువంటి వాటిని చంద్రబాబు ప్రోత్సహించరు కూడా. దేశాభివృద్ధి, యువత భవిష్యత్తు, ప్రజా సంక్షేమమే ఆయనకు ముఖ్యం. రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన చేస్తున్న పోరాటంలో మనం కూడా పాత్రను పోషించుదాం” అని గ్రీష్మ పిలుపునిచ్చారు. 

ఈ కార్యక్రమంలో టీడీపీ ఎన్నారై కోర్ కమిటీ సభ్యులు కుర్రా పవన్, బత్తల శివ, కొర్రపాటి సుమంత్, దాసరి వంశీ, కోనేరు నరేశ్, కుడితిపూడి శ్రీకాంత్, కండ్ర వెంకట్, మిక్కిలినేని అనిల్ తదిరులు పాల్గొన్నారు.
TDP
Germany
NRI
Celebrations
Andhra Pradesh

More Telugu News