Thummala: రైతుల పొలంలో బ్యాంకు ఫ్లెక్సీలు... మంత్రి తుమ్మల ఆగ్రహం

Minister Thummala responds on Flexi in farmer field
  • రైతు పొలంలో ఫ్లెక్సీ ఏర్పాటుపై అధికారుల నుంచి తుమ్మల ఆరా
  • రుణం తీసుకొని చెల్లించనందుకు భూమిని స్వాధీనం చేసుకున్నట్లు ఫ్లెక్సీ
  • బ్యాంకు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి
కామారెడ్డి జిల్లాలో రైతుల పొలాల్లో డీసీసీబీ బ్యాంకుల ఫ్లెక్సీల ఏర్పాటుపై తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు పొలంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంపై ఆయన అధికారుల నుంచి ఆరా తీశారు. బ్యాంకు అధికారులపై ఆయన మండిపడ్డారు. బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలు చెల్లించడం లేదంటూ కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పొల్కంపేటకు చెందిన ఓ రైతు వ్యవసాయ భూమిలో డీసీసీబీ బ్యాంకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది.

'ఈ భూమిని నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, లింగంపేట నందు తనఖా ఉంచి రుణం పొంది... తిరిగి చెల్లించనందున తెలంగాణ సహకార చట్టం 1964ను అనుసరించి భూమిని స్వాధీనం చేసుకోవడం జరిగింది' అని పొలంలో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు.
Thummala
Telangana
Congress

More Telugu News