హైదరాబాద్‌లో 5 వేల కిలోల డ్రగ్స్ ధ్వంసం

Drugs destroyed in Hyderabad
  • మూడేళ్లుగా పట్టుకున్న డ్రగ్స్‌ను ధ్వంసం చేసిన అధికారులు
  • 30 పోలీస్ స్టేషన్ల పరిధిలో 122 కేసుల్లో పట్టుకున్న డ్రగ్స్ ధ్వంసం
  • ధ్వంసం చేసిన డ్రగ్స్‌లో 15 రకాల నార్కోటిక్ డ్రగ్స్ 
సైబరాబాద్ పరిధిలో అధికారులు 5 వేల కిలోల డ్రగ్స్‌ను ధ్వంసం చేశారు. మూడేళ్లుగా పట్టుకున్న వివిధ రకాల డ్రగ్స్‌ను ఈరోజు ధ్వంసం చేశారు. ఈ మేరకు అధికారులు ప్రకటించారు. బాలానగర్, రాజేంద్రనగర్, మాదాపూర్, మేడ్చల్, శంషాబాద్ జోన్లలకు చెందిన 30 పోలీస్ స్టేషన్ల పరిధిలో 122 కేసుల్లో పట్టుకున్న డ్రగ్స్‌ను ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే, 2600 లీటర్ల హాష్ ఆయిల్, కొకైన్‌ను అధికారులు ధ్వంసం చేశారు. ఈ డ్రగ్స్‌ను హైదరాబాద్ సమీపంలోని బయో మెడికల్ ఫ్యాక్టరీలో ధ్వంసం చేశారు. ధ్వంసం చేసిన డ్రగ్స్‌లో 15 రకాల నార్కోటిక్ డ్రగ్స్ ఉన్నాయి.
Go Back to Shorts
Drugs
Hyderabad

More Telugu News