Chandrababu: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు

Chandrababu congratulates Pawan Kalyan becoming Deputy Chief Minister
  • ఏపీ మంత్రులకు నేడు శాఖల కేటాయింపు
  • ఉప ముఖ్యమంత్రిగా పవన్ కల్యాణ్
  • ప్రజా పాలనా శకానికి నాంది పలుకుతామన్న చంద్రబాబు
ఏపీ మంత్రులకు నేడు శాఖలు కేటాయించారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. ప్రజలకు సుపరిపాలన అందించడమే ధ్యేయంగా నూతన మంత్రుల పనితీరు ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ప్రజా పాలనలో కొత్త అధ్యాయం మొదలవుతోందని పేర్కొన్నారు.

"ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నియమితులైన పవన్ కల్యాణ్ కు శుభాకాంక్షలు. ఏపీ క్యాబినెట్ లోని మంత్రులు అందరికీ శాఖలు కేటాయించడం జరిగింది. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మేం అందరం కలిసి రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తామని, ప్రజా పాలనా శకానికి నాంది పలుకుతామని ప్రతిజ్ఞ చేశాం. మంత్రులుగా పోర్ట్ ఫోలియోలు అందుకున్న మీరు మన ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి కృషి చేస్తారని గట్టిగా నమ్ముతున్నాను. ఈ పవిత్రమైన బాధ్యతలతో కూడిన ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్న మీకందరికీ బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
Chandrababu
Pawan Kalyan
Deputy CM
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News