Hyderabad: ఆర్‌టీసీ బస్సు కింద‌ పడి ఇంటర్‌ విద్యార్థిని దుర్మరణం.. వైర‌ల్‌ వీడియో!

Inter Student Dies After Her Fall In Rtc Bus Tyre In Hyderabad
  • మధుర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం
  • సీసీటీవీ కెమెరాల్లో రికార్డ‌యిన ప్ర‌మాదం దృశ్యాలు 
  • మృతురాలిని ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న మెహరీన్‌గా గుర్తింపు
హైద‌రాబాద్, మ‌ధుర న‌గ‌ర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఆర్‌టీసీ బ‌స్సులో నుంచి ఓ విద్యార్థిని కాలుజారి ప‌డింది. దీంతో ఆమె బ‌స్సు చ‌క్రాల కింద ప‌డి ప్రాణాలు కోల్పోయింది. ఆర్‌టీసీ బ‌స్సు డ్రైవ‌ర్ అప్ర‌మ‌త్త‌మై బ‌స్సును నిలిపి వేశాడు.

స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతురాలిని యూసుఫ్‌గూడ‌లో ఉన్న మాస్ట‌ర్స్ కాలేజీలో ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ చ‌దువుతున్న మెహ‌రీన్‌గా పోలీసులు గుర్తించారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఈ రోడ్డు ప్ర‌మాద ఘ‌ట‌న‌కు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ‌య్యాయి. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.
Hyderabad
Telangana
TGSRTC

More Telugu News