కాకినాడలో డయేరియా పంజా.. 50 మందికి అస్వస్థత!
- కాకినాడ జిల్లా తొండంగి మండలం కొమ్మనాపల్లిలో ప్రబలిన డయేరియా
- వాంతులు, విరేచనాలతో ఆసుపత్రిలో చేరుతున్న గ్రామస్తులు
- కాకినాడ జీజీహెచ్‌కి తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఐదుగురి తరలింపు
ఈ ఘటనపై తుని ఎమ్మెల్యే యనమల దివ్య స్పందించారు. కొమ్మనాపల్లి గ్రామంలో 34 మంది అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. అందులో పది మంది కోలుకున్నారని ఆమె చెప్పారు. ఫుడ్ పాయిజన్, కలుషిత నీరు అస్వస్థతకి కారణంగా తెలిసిందని, అధికారులు ఇప్పటికే శాంపిల్స్ కలెక్ట్ చేసి టెస్టులకి పంపించారని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. ఇబ్బంది ఉన్నవారిని కాకినాడ జీజీహెచ్‌కి తరలించే ఏర్పాటు చేస్తున్నారని యనమల దివ్య పేర్కొన్నారు.