Digital India: డిజిటల్ ఇండియా అంటే ఇదే! ఈ వీడియో చూస్తే మతులు పోవడం ఖాయం.. కావాలంటే చూడండి!

This is called Digital India here is the viral video
  • ఓ డ్యాన్సర్ ఆలోచనకు నెటిజన్ల ఫిదా
  • క్యూఆర్ కోడ్‌ను ఫోన్‌లో చూపిస్తూ నృత్యం
  • కామెంట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు
డిజిటల్ ఇండియా.. కరోనా సమయంలో దేశంలో వెలుగులోకి వచ్చిన నగదు బదిలీ విధానం. తొలుత ఈ విధానానికి అలవాటు పడడానికి దేశ ప్రజలు కొంత ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత క్రమంగా అలవాటు పడిపోయారు. ప్రస్తుతం రూపాయి నుంచి మొదలుకొని వేల రూపాయల వరకు అన్నీ డిజిటల్ విధానంలోనే జరుగుతున్నాయి. రోడ్డు పక్కన ఉండే కూరగాయల షాపుల నుంచి షాపింగ్ మాల్స్ వరకు అన్నీ డిజిటల్ పేమెంట్సే. ఇక, జూపార్క్‌లు, టీటీడీ దేవస్థానం, ఇతర ప్రభుత్వ సంస్థలు అయితే నగదును తీసుకోవడం పూర్తిగా మానేశాయి. దీంతో డిజిటల్ విధానం అనివార్యమైంది.

నగదు రహిత లావాదేవీల విషయంలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్ ఎంతో ముందుంది. ఇక ఈ విషయాన్ని పక్కనపెడితే డిజిటల్ ఇండియా ఎంతగా పురోగమిస్తుందో చెప్పేందుకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఓ డ్యాన్సర్ స్టేజిపై డ్యాన్స్ చేస్తూ చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని క్యూఆర్ కోడ్‌ను ప్రదర్శించింది. ఆమె నృత్యానికి మెచ్చి డబ్బులు ఇవ్వాలనుకునే వారు ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ఇవ్వాలనుకున్న మొత్తాన్ని పంపిస్తున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందన్న విషయం తెలియరాలేదు కానీ, సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది.

ఈ వీడియోకు కామెంట్లు కూడా హోరెత్తుతున్నాయి. డిజిటల్ ఇండియా అంటే ఇదే అని కొందరు కామెంట్ చేస్తే.. మోదీ కోరుకున్న డిజిటల్ ఇండియా ఇదేనని మరికొందరు అంటున్నారు. ఆ డ్యాన్సర్‌కు వచ్చిన ఆలోచనకు మరికొందరు ఫిదా అయితే, ఇంకొందరు డిజిటల్ ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా ఆమెను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకొందరు మాత్రం ఇందులో మోదీ తప్పేముందని ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియోను మీరూ వీక్షించండి!
Digital India
Stage Dancer
Viral Videos
Digital Payment

More Telugu News