Pawan Kalyan: వారికి ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పెష‌ల్‌ థ్యాంక్స్..!

Janasena President Pawan Kalyan Specian Tanks to PM Modi and Central Ministers
  • ఏపీలో కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటు అనంత‌రం త‌న‌కు విషెస్ తెలిపిన వారికి ప‌వ‌న్ కృత‌జ్ఞ‌త‌లు
  • కేంద్ర మంత్రులు రామ్మోహ‌న్ నాయుడు, కుమార స్వామికి థ్యాంక్స్ చెప్పిన‌ ప‌వ‌న్‌ 
  • త‌న‌కు విషెస్ తెలిపిన ఎంపీ ఈట‌ల, స్మృతి ఇరానీ, అస్సాం సీఎంకు ధ‌న్య‌వాదాలు
  • ఈ మేర‌కు జ‌న‌సేనాని వ‌రుస ట్వీట్లు
ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎన్‌డీఏ కూట‌మి విజ‌యం, కొత్త ప్ర‌భుత్వం ఏర్పాటు అనంత‌రం త‌న‌కు విషెస్ తెలిపిన‌ కేంద్ర మంత్రులు రామ్మోహ‌న్ నాయుడు, కుమార స్వామికి ప‌వ‌న్‌ ప్ర‌త్యేకంగా థ్యాంక్స్ చెప్పారు. అలాగే త‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన తెలంగాణ బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్‌, అసోం సీఎం హిమంత బిశ్వశర్మ, బీజేపీ నేత స్మృతి ఇరానీకి కూడా మంత్రి పవన్ క‌ల్యాణ్‌ ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలిపారు. 

ఈ మేర‌కు జ‌న‌సేనాని ఎక్స్ (ట్విట్ట‌ర్‌) లో వ‌రుస‌ ట్వీట్లు చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో ప‌థంలో న‌డిపించేందుకు మంత్రిగా త‌న బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించేందుకు కృషి చేస్తాన‌ని ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ పేర్కొన్నారు.
Pawan Kalyan
Janasena
PM Modi
NDA

More Telugu News