Harvard University: మనుషుల మధ్యే గ్రహాంతరవాసులు.. హార్వర్డ్ యూనివర్సిటీ సంచలన పరిశోధన

Harvard University study has claimed that aliens could be living among humans secretly on Earth
  • ఏలియన్స్ భూమి మీద మనుషుల మధ్యే ఉండొచ్చన్న అధ్యయనం
  • యూఎఫ్‌వోలు గ్రహాంతవాసుల కోసం వచ్చిన స్నేహితుల అంతరిక్ష నౌకలు కావొచ్చని పరికల్పన
  • ఆసక్తికరమైన అధ్యయనాన్ని ప్రచురించిన హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు
గ్రహాంతరవాసులకు సంబంధించిన సమాచారం ఎల్లప్పుడూ ఆసక్తిదాయకమే. అయితే దశాబ్దాలుగా అన్వేషణ కొనసాగుతున్నా ఏలియన్స్‌ జాడకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి కచ్చితమైన సమాచారం లేదు. దీంతో ఈ విశ్వంలో మనుషులు మాత్రమే ఒంటరిగా ఉన్నారా?.. అనే ప్రశ్నకు ఇంకా నిర్దిష్టమైన సమాధానం లేదు. అయితే హార్వర్డ్ యూనివర్సిటీ తాజా అధ్యయనం ఈ భూమిపై మనుషుల మధ్యే గ్రహాంతర వాసులు కూడా జీవిస్తుండవచ్చునని చెబుతోంది. రూపం మార్చుకొని మనుషుల మధ్యే రహస్యంగా నివసిస్తుండవచ్చునని అభిప్రాయపడింది.

గ్రహాంతర జీవులకు సంబంధించినవిగా భావించే యూఎఫ్‌వోలపై (ఎగిరే పళ్లాలు) అధ్యయనం కోసం హార్వర్డ్ యూనివర్శిటీ ఏర్పాటు చేసిన ‘హ్యూమన్ ఫ్లరిషింగ్ ప్రోగ్రామ్‌’లోని పరిశోధకులు ఈ మేరకు తమ పరిశోధనను ప్రచురించారు. ఏలియన్స్ భూగర్భంలో, చంద్రుడిపై లేదా మనుషుల మధ్యే జీవిస్తూ ఉండవచ్చునని అధ్యయనం పేర్కొంది. యూఎఫ్‌వోలు లేదా గుర్తించబడని వైమానిక దృగ్విషయాలు భూమిపై నివసించే గ్రహాంతర వాసుల కోసం వచ్చిన స్నేహితుల అంతరిక్ష నౌకలు కావచ్చుననే కోణంలో కూడా అన్వేషిస్తున్నట్టు అధ్యయనం పేర్కొంది.

 భూమికి అవతల జీవాన్ని నిర్ధారించే ఆధారాలు, సిద్ధాంతాల విషయంలో అవగాహన పెరుగుతోందని అధ్యయనం పేర్కొంది. ‘క్రిప్టోటెర్రెస్ట్రియల్’ పరికల్పనపై తాము దృష్టి సారించామని, భూమి మీద, భూగర్భంలో, పరిసరాల్లో గ్రహాంతరవాసుల జాడపై అధ్యయనం చేస్తున్నట్టు పేర్కొంది.
Harvard University
aliens
UFOs
Human Flourishing Program

More Telugu News