Raghunandan Rao: కేసీఆర్‌పై ఈడీ ఇప్పుడే కేసు నమోదు చేసింది: రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు

Raghunandan Rao says ED officers came to KCR office
  • కేసీఆర్ ఇంటికి ఈడీ అధికారులు వచ్చారన్న బీజేపీ నేత
  • గొర్రెల కుంభకోణం కేసులో కేసీఆర్‌కు ఈడీ నోటీసులు ఇచ్చిందన్న రఘునందన్ రావు
  • కేసీఆర్, హరీశ్ రావు, వెంకట్రామిరెడ్డిలకు ముందుంది మొసళ్ల పండగ అని వ్యాఖ్య
బీజేపీ సీనియర్ నేత, ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో మెదక్ లోక్ సభ స్థానం నుంచి విజయం సాధించిన రఘునందన్ రావు... తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాసేపటి క్రితం కేసీఆర్‌పై ఈడీ కేసు నమోదయిందని తెలిపారు.

ఆయన కోసం ఈడీ అధికారులు వచ్చారన్నారు. గొర్రెల కుంభకోణం కేసులో ఆయనకు ఈడీ నోటీసులు ఇచ్చిందన్నారు. కేసీఆర్, హరీశ్ రావు, వెంకట్రామిరెడ్డిలకు ముందుంది మొసళ్ల పండుగ అని హెచ్చరించారు.

సిద్దిపేటలో హరీశ్ రావు ఉండగా... ఆయన ఉన్న మీటింగ్‌కు ఎస్కార్ట్ లో ఇంకొకరు వస్తారని ఆయన ఎప్పుడూ ఉహించలేదన్నారు. బీఆర్ఎస్ వాళ్లు కోట్లాది రూపాయలు పంచినప్పటికీ లోక్ సభ ఎన్నికల్లో గెలవలేదన్నారు. బీఆర్ఎస్ రూ.500 కోట్లు ఖర్చు పెట్టిందని ఆరోపించారు. బీజేపీ మాత్రం రూపాయి ఖర్చు పెట్టకుండా గెలిచిందన్నారు. మెదక్ మున్సిపాలిటీలోనూ బీజేపీ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు.
Raghunandan Rao
BJP
KCR
BRS
Harish Rao
ED

More Telugu News