Nara Bhuvaneswari: నా సంతోషాన్ని రెట్టింపు చేశావు బాలా అన్నయ్యా: నారా భువనేశ్వరి

Nara Bhuvaneswari shares a video of her brother Balakrishna affection
  • నేడు చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం
  • వేదికపై అన్నీ తానై వ్యవహరించిన నందమూరి బాలకృష్ణ
  • తన చెల్లెలు నారా భువనేశ్వరిని ఆప్యాయంగా ముద్దాడిన వైనం
ఇవాళ చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవంలో నందమూరి బాలకృష్ణ ఎంతో ఉత్సాహంగా అన్నీ తానై వ్యవహరించారు. వేదికపైకి అతిథులను ఆహ్వానించడం, వారికి సరైన సదుపాయాలు అందేలా చూడడం వంటి పనులతో బాలయ్య బిజీగా కనిపించారు. ఈ క్రమంలో ఆయన తన సోదరి నారా భువనేశ్వరి నుదుటిపై ఆప్యాయంగా ముద్దాడారు. 

దీనిపై నారా భువనేశ్వరి సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఒక భార్యగా, ఒక అమ్మగా నా మనసు ఆనందంతో నిండిన క్షణాల్లో... నాకు తోడబుట్టిన ప్రేమను పంచుతూ నా సంతోషాన్ని రెట్టింపు చేశావు బాలా అన్నయ్యా... అంటూ భువనేశ్వరి ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆమె పంచుకున్నారు.
Nara Bhuvaneswari
Balakrishna
Chandrababu
Nara Lokesh
TDP
Andhra Pradesh

More Telugu News