Narendra Modi: గన్నవరం ఎయిర్ పోర్టులో ప్రధాని మోదీకి స్వాగతం పలికిన చంద్రబాబు, పవన్

Chandrababu and Pawan Kalyan welcomes PM Modi at Gannavaram airport
  • ఈ ఉదయం 11.27 గంటలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం
  • ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ
  • ఎయిర్ పోర్టు నుంచి ఒకే వాహనంలో బయల్దేరిన మోదీ, చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ గన్నవరం విమానాశ్రయంలో ప్రధాని నరేంద్ర మోదీకి స్వయంగా స్వాగతం పలికారు. అనంతరం, ప్రధాని మోదీ, చంద్రబాబు ఒకే వాహనంలో కేసరపల్లి ఐటీ పార్కు వద్దకు బయల్దేరారు. ఈ ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తుండడం తెలిసిందే. మోదీ, చంద్రబాబు, పవన్ కాసేపట్లో వేదికపైకి చేరుకోనున్నారు.

ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఇప్పటికే వేదికపైకి అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ వంటి పలువురు జాతీయ స్థాయి నేతలు, మెగాస్టార్ చిరంజీవి, రజనీకాంత్ తదితర ఇతర రంగాల ప్రముఖలు చేరుకున్నారు.
Narendra Modi
Chandrababu
Pawan Kalyan
Oath Taking Ceremony
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh

More Telugu News