రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారం... ప్రత్యేక విమానంలో ఏపీకి చిరంజీవి
- చిరంజీవితో పాటు భార్య సురేఖ, చిన్నకూతురు శ్రీజ, మనవరాళ్లు
- బేగంపేట విమానాశ్రయం నుంచి గన్నవరం బయలుదేరిన చిరు కుటుంబం
- ప్రముఖులతో గన్నవరం విమానాశ్రయం కిటకిట
టీడీపీ అధినేత చంద్రబాబు రేపు ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవిని ఏపీ ప్రభుత్వం విశిష్ట అతిథిగా ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో చిరంజీవి కుటుంబం ఏపీకి బయలుదేరారు. మరోపక్క, రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారం నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయం ప్రముఖులతో కిటకిటలాడుతోంది.