చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని సహా ప్రముఖులు... 7 వేల మంది పోలీసులతో బందోబస్తు
- రేపు ఉదయం కేసరపల్లిలోని ఐటీ టవర్ వద్ద సీఎంగా చంద్రబాబు ప్రమాణం
- మోదీ, అమిత్ షా సహా హాజరవుతున్న వీవీఐపీలు
- ప్రమాణ స్వీకారానికి శరవేగంగా ఏర్పాట్లు
- విజయవాడ నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపు
- పాస్‌లు ఉన్నవారి వాహనాలకే సభా ప్రాంగణం వైపు వెళ్లేందుకు అనుమతి
విజయవాడ నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నారు. పాస్‌లు ఉన్న వారి వాహనాలనే సభా ప్రాంగణం వైపు వెళ్లేందుకు అనుమతించనున్నట్లు పోలీసులు తెలిపారు. నగరంలో ప్రముఖులు బస చేసే హోటళ్ల వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాటు చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా సీపీ రామకృష్ణ తెలిపారు. అమిత్ షా, బండి సంజయ్ తదితరులు ఈరోజు రాత్రికే ఏపీకి రానున్నారు.