BJP: బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై లైంగిక వేధింపుల ఆరోపణలు... కాంగ్రెస్ నేత ఫైర్

Congress accuses Amit Malviya of indulging in sexual exploitation of women
  • అమిత్ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న కాంగ్రెస్ నేత సుప్రియ శ్రీనటే 
  • అమిత్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్
  • ఫైవ్ స్టార్ హోటల్లోనే కాకుండా బీజేపీ కార్యాలయాల్లోనూ వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణ
బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై కాంగ్రెస్ నేత సుప్రియ శ్రీనటే సంచలన ఆరోపణలు చేశారు. అమిత్ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని... ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సుప్రియ సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఆయనపై ఆరెస్సెస్ సభ్యులు శంతను సిన్హానే తీవ్ర ఆరోపణలు చేశారని తెలిపారు.

అమిత్ మాల్వియా కేవ‌లం ఫైవ్ స్టార్ హోట‌ల్స్‌లోనే కాకుండా ప‌శ్చిమ బెంగాల్‌లోని బీజేపీ కార్యాల‌యాలను కూడా మ‌హిళ‌ల‌పై వేధింపుల‌కు వేదిక‌గా వాడుకున్నార‌ని ఆరోపించారు. మ‌హిళ‌ల‌కు న్యాయం చేయాల‌ని తాము బీజేపీని డిమాండ్ చేస్తున్నామన్నారు.

ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేసి ఇరవై నాలుగు గంటలు గడవకముందే ఐటీ సెల్ చీఫ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినట్లు చెప్పారు. అమిత్ మాల్వియాను తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని సుప్రియ డిమాండ్ చేశారు. ఆయన పదవిలో కొనసాగితే స్వతంత్ర విచారణ సాధ్యం కాదన్నారు. మాల్వియాను పదవి నుంచి తొలగించే వరకు బాధితులకు న్యాయం జరగదన్నారు.
BJP
Congress
New Delhi

More Telugu News