మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జుతో కేంద్ర మంత్రి జైశంకర్ భేటీ
- మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి భారత్‌కు వచ్చిన ముయిజ్జు
- ఆయనతో సోమవారం సమావేశమైన జైశంకర్
- రెండు దేశాల మధ్య సత్సంబంధాలపై ఇరువురూ చర్చ
మరోవైపు ముయిజ్జుతో సమావేశమైనట్లు జైశంకర్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా తెలిపారు. "ఈ రోజు న్యూఢిల్లీలో మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మొమహ్మద్ ముయిజ్జును కలుసుకోవడం ఆనందంగా ఉంది. మాల్దీవులతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాము" అంటూ ట్వీట్ చేశారు.