Balakrishna: బాలకృష్ణకు నారా లోకేశ్, పురంధేశ్వరి, అచ్చెన్నాయుడు, ర‌వితేజ బ‌ర్త్‌డే విషెస్‌

Birthday Wishes to Balakrishna from Nara Lokesh and others
  • నేడు బాలకృష్ణ పుట్టినరోజు
  • నా ముద్దుల బాలా మావయ్యకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ లోకేశ్ ట్వీట్
  • బాలకృష్ణకు హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ అచ్చెన్నాయుడు ట్వీట్‌
  • హ్యాపీ బ‌ర్త్‌డే బ్ర‌ద‌ర్‌ అంటూ పురంధేశ్వరి గ్రీటింగ్స్
  • హ్యాపీ బ‌ర్త్‌డే బాల‌య్య బాబు అంటూ ర‌వితేజ విషెస్‌
టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ జన్మదినం నేడు. ఈ సందర్భంగా బాలయ్యకు సినీ, రాజకీయ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఆయ‌న అల్లుడు నారా లోకేశ్‌ కూడా బాల‌య్య‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. నా ముద్దుల బాలా మావయ్యకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ లోకేశ్ ట్వీట్ చేశారు. 

టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు కూడా బాల‌కృష్ణ‌కు ఎక్స్ వేదిక‌గా విషెస్ తెలిపారు. తండ్రి స్వర్గీయ అన్న నందమూరి తారకరామారావు గారి అడుగుజాడల్లో నడుస్తూ అటు హిందూపూర్ ఎమ్మెల్యేగా, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్‌గా, సినిమా హీరోగా ఏది చేసినా సమాజసేవే పరమావధిగా అడుగులు వేస్తూ ప్రజల గుండెల్లో #GodOfMassesగా తనదైన ముద్ర వేసుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అంటూ అచ్చెన్నాయుడు ట్వీట్ చేశారు. 

అటు బాల‌కృష్ణ సోద‌రి, రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షురాలు పురంధేశ్వ‌రి ఆయ‌న‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. పుట్టినరోజు శుభాకాంక్షలు బ్ర‌ద‌ర్‌! మీ కోరికలన్నీ నెరవేరి, మీరు కలలుగన్న అన్నింటా విజయాలు సాధించాల‌ని కోరుకుంటున్నా. నీపై ఎల్ల‌ప్పుడూ దేవుడి ఆశీర్వదాలు ఉండాలి అని పురంధేశ్వ‌రి త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. 

అలాగే మాస్ మ‌హారాజా ర‌వితేజ కూడా బాల‌య్య‌కు బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేశాడు. హ్యాపీ బ‌ర్త్‌డే బాల‌య్య బాబు. ఈ ఏడాది కూడా మీకు అంతా మంచే జ‌ర‌గాల‌ని దేవుడిని ప్రార్థిస్తున్నాను. గొప్ప విజయాలు, మంచి ఆరోగ్యం, ఆనందంతో ఈ ఏడాది మీకు మరో అద్భుతమైన సంవత్సరంగా నిలిచిపోవాల‌ని కోరుకుంటున్నాను అంటూ ర‌వితేజ ట్వీట్ చేశారు.
Balakrishna
Birthday Wishes
Nara Lokesh
Kinjarapu Acchamnaidu
Raviteja
Daggubati Purandeswari

More Telugu News