Sonakshi Sinha: బాయ్‌ఫ్రెండ్‌తో సోనాక్షి సిన్హా వివాహం ఫిక్స్.. డేట్ ఎప్పుడంటే..!

Sonakshi Sinha to marry boyfriend Zaheer Iqbal on June 23
  • బాయ్‌ఫ్రెండ్ జహీర్ ఇక్బాల్‌ను పెళ్లాడనున్న సోనాక్షి
  • ఈ నెల 23న సౌత్ ముంబైలో వివాహం
  • సల్మాన్ సినిమాలతో ఇద్దరూ బాలీవుడ్ ఎంట్రీ
  • వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హా
సినీ నటి సోనాక్షి సిన్హా వివాహానికి బాలీవుడ్ రెడీ అవుతోంది. బాయ్‌ఫ్రెండ్ జహీర్ ఇక్బాల్‌ను ఆమె వివాహం చేసుకోబోతున్నారు. ఈ నెల 23న దక్షిణ ముంబైలో వీరి పెళ్లి జరగనున్నట్టు తెలుస్తోంది. సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హా ఆశీస్సులు కూడా వీరికి ఉన్నట్టు సమాచారం.

సోనాక్షి, జహీర్ ఇద్దరూ సల్మాన్‌ఖాన్ సినిమాలతోనే బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. సోనాక్షి 2010లో దబాంగ్ సినిమాలో నటించగా, సల్మాన్ నిర్మించిన నోట్‌బుక్ సినిమాతో 2019లో జహీర్ బాలీవుడ్‌లో అరంగేట్రం చేశాడు. ‘డబుల్ ఎక్స్ఎల్’ సినిమాలో ఇద్దరూ కలిసి నటించారు.
Sonakshi Sinha
Zaheer Iqbal
Bollywood
Sonakshi Sinha Marriage

More Telugu News