Narendra Modi: మోదీ ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాల నేతలకు ఆహ్వానం

Invitations to SAARC countries leaders for Modi oath taking ceremony as Prime Minister
  • వరుసగా మూడోసారి భారత ప్రధానిగా నరేంద్ర మోదీ
  • నేడు ప్రమాణస్వీకారం చేయనున్న మోదీ
  • మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి రానున్న ఏడుగురు దేశాధినేతలు
మరి కొన్ని గంటల్లో దేశ రాజధాని ఢిల్లీలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ రాత్రి 7.15 గంటలకు రాష్ట్రపతి భవన్ వేదికగా మోదీ ప్రమాణ స్వీకారం జరగనుంది.

కాగా, మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సార్క్ దేశాల నేతలను కూడా ఆహ్వానించారు. మోదీ ప్రమాణ స్వీకారానికి ఏడుగురు దేశాధినేతలు హాజరుకానున్నారు. 

మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం రాష్ట్రపతి భవన్ చుట్టూ బహుళ అంచెల భద్రతా వలయం ఉంది. ఢిల్లీలో అడుగడుగునా సీసీ కెమెరాలు, డ్రోన్లతో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశారు. 

దు కంపెనీల కేంద్ర పారామిలిటరీ బలగాలను, ఎన్ఎస్ జీ కమాండోలను మోహరించారు. ఒక్క రాష్ట్రపతి భవన్ వద్దే 2,500 మంది పోలీసులను మోహరించారు.
Narendra Modi
Prime Minister
Oath Taking
SAARC
India

More Telugu News