Ramoji Rao: రామోజీ అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు వీరే

Nara Lokesh And Other Politicians In Ramoji Last Rites
  • నిన్న తెల్లవారుజామున కన్నమూసిన రామోజీరావు
  • రామోజీ ఫిలింసిటీలో అంత్యక్రియలు పూర్తి
  • పాడెమోసిన చంద్రబాబునాయుడు
  • హాజరైన నారా లోకేశ్, ఎర్రబెల్లి, జూపల్లి, వీహెచ్ వంటి ప్రముఖులు
ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు అంత్యక్రియల్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న తెల్లవారుజామున రామోజీ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సంతాపం తెలిపారు. 

ఈ ఉదయం జరిగిన రామోజీ అంత్యక్రియల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన నారా లోకేశ్, బీఆర్ఎస్ నాయకులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, నామా నాగేశ్వర్‌రావు, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు, కేఆర్ సురేశ్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, సుజనా చౌదరి, జూపల్లి కృష్ణారావు, అరికెపూడి గాంధీ, వెనిగండ్ల రాము తదితరులు పాల్గొన్నారు. అంత్యక్రియలకు హాజరైన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు.. రామోజీరావు పాడె మోశారు.
Ramoji Rao
Last Rites
Romoji Film City
Chandrababu
Nara Lokesh

More Telugu News