Ramoji Rao: స్మృతివనం వద్ద రామోజీకి వీడ్కోలు.. అంత్యక్రియలు పూర్తి

Ramoji Rao Last Rights
  • కన్నీటితో సాగనంపిన కుటుంబ సభ్యులు
  • హాజరైన ప్రముఖులు, అభిమానులు
  • వందలాదిగా తరలివచ్చిన రామోజీ సంస్థల ఉద్యోగులు
  • రామోజీ పార్థివదేహానికి గౌరవ వందనం
రామోజీరావు అంత్యక్రియలు ముగిశాయి. రామోజీ ఫిల్మ్ సిటీలోని స్మృతి వనం వద్ద రామోజీరావుకు కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రముఖులు కడసారి వీడ్కోలు పలికారు. రామోజీరావు కుమారుడు కిరణ్‌ అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అధికారిక లాంఛనాల మధ్య, పోలీసుల గౌరవ వందనంతో రామోజీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. రామోజీ అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు కన్నీటితో వీడ్కోలు పలికారు. అంత్యక్రియలకు రామోజీ సంస్థల ఉద్యోగులు వందలాదిగా తరలివచ్చారు. అంతిమ సంస్కారాల్లో కిషన్ రెడ్డి, బండి సంజయ్, నారా లోకేశ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, నామా నాగేశ్వరరావు, వి.హనుమంతరావు, కేఆర్‌ సురేశ్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, సుజనా చౌదరి, జూపల్లి కృష్ణారావు, అరికెపూడి గాంధీ, వెనిగండ్ల రాము తదితరులు పాల్గొన్నారు.



Ramoji Rao
Last Rights
SmritiVanam
Ramoji Filmcity

More Telugu News