Telangana: మోదీ కేబినెట్లో తెలంగాణ నుంచి ముగ్గురికి అవకాశం?

Telangana may get 2 minister berts in modi cabinet
  • ఎనిమిది మందిలో మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న ఏడుగురు ఎంపీలు
  • ఒక కేబినెట్, రెండు సహాయ మంత్రి పదవులు దక్కే ఛాన్స్
  • ఒక ఎంపీకి జాతీయస్థాయిలో పార్టీలో కీలక పదవి ఇచ్చే అవకాశం
నరేంద్రమోదీ కేబినెట్లో తెలంగాణకు రెండు లేదా మూడు పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2019లో 4 సీట్లు గెలిచిన బీజేపీ ఈసారి మాత్రం ఓటింగ్ శాతాన్ని రెండింతలు పెంచుకొని... ఎనిమిది సీట్లు గెలుచుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు తన కేబినెట్లో మోదీ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

తెలంగాణ నుంచి ఎనిమిది మంది ఎంపీలు గెలవగా.... ఏడుగురు పదవులపై ఆశలు పెట్టుకున్నారు. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ కూడా కేంద్రమంత్రి పదవిని ఆశిస్తున్నారు.

తెలంగాణ నుంచి ఒక కేబినెట్, రెండు సహాయ మంత్రి పదవులు దక్కవచ్చునని భావిస్తున్నారు. కిషన్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, డీకే అరుణ, రఘునందన్ రావులలో ఒకరికి పదవి దక్కుతుందని భావిస్తున్నారు. ఇందులో కిషన్ రెడ్డి ముందున్నారని చెబుతున్నారు. అలాగే, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్, డాక్టర్ కే లక్ష్మణ్‌లలో ఇద్దరికి పదవులు రావొచ్చునని భావిస్తున్నారు. ఒక ఎంపీకి జాతీయస్థాయిలో పార్టీలో కీలక పదవి ఇవ్వనున్నారని తెలుస్తోంది.
Telangana
Narendra Modi

More Telugu News