జూన్ 9న రాత్రి 7.15 గంటలకు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న మోదీ
- వరుసగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ
- మోదీతో ప్రమాణ స్వీకారం చేయించనున్న రాష్ట్రపతి
- అదే సమయంలో క్యాబినెట్ సభ్యులతోనూ ప్రమాణ స్వీకారం
కాగా, టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వీరి భేటీ దాదాపు అరగంట పాటు సాగింది. అనంతరం చంద్రబాబు... అమిత్ షాను కలిశారు. బీజేపీ అగ్రనేతలతో సమావేశం అనంతరం చంద్రబాబు టీడీపీ ఎంపీలను కలిశారు. ఎన్డీయే పెద్దలతో సమావేశం వివరాలను చంద్రబాబు తమ ఎంపీలతో పంచుకున్నారు.