Yarlagadda Venkatrao: వల్లభనేని వంశీ అనుచరులే మా వాళ్లను కవ్వించారు: యార్లగడ్డ వెంకట్రావు

Yarlagadda Venkatrao says Vallabhaneni Vamsi aides provoked TDP cadre
  • గన్నవరంలో ఉద్రిక్తతలు
  • వల్లభనేని వంశీ నివాసంపై దాడి చేశారంటూ వైసీపీ ఆరోపణలు
  • సీఆర్పీఎఫ్ బలగాల లాఠీచార్జిలో తమ వాళ్లకే దెబ్బలు తగిలాయన్న యార్లగడ్డ
  • తమ వాళ్లలో ఐదుగురు కనిపించడంలేదని ఆందోళన
  • వారిని వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్
గన్నవరంలో వల్లభనేని వంశీ నివాసంపై టీడీపీ గూండాలు దాడి చేశారంటూ వైసీపీ తీవ్ర ఆరోపణలు చేయడం తెలిసిందే. దీనిపై గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పందించారు. వల్లభనేని వంశీ అనుచరులే తమ వాళ్లను రెచ్చగొట్టారని వెల్లడించారు. వంశీ అనుచరులు తమ వాళ్లను దూషించారని ఆరోపించారు. 

"ఉద్రిక్తతల నేపథ్యంలో సీఆర్పీఎఫ్ బలగాలు మా వాళ్లపై లాఠీ చార్జి చేశాయి. సీఆర్పీఎఫ్ బలగాల దాడిలో ఎనిమిది మంది గాయపడ్డారు. కొందరు పోలీసులు ఇంకా వైసీపీకి కొమ్ము కాస్తున్నారు. మా కార్యకర్తల్లో ఐదుగురు కనిపించడంలేదు. వారిని వెంటనే విడిచిపెట్టాలి" అని యార్లగడ్డ వెంకట్రావు డిమాండ్ చేశారు.
Yarlagadda Venkatrao
Vallabhaneni Vamsi
TDP
YSRCP
Gannavaram

More Telugu News