Mothkupalli Narasimhulu: జగన్ తన అహంకారం వల్లే ఈ పరిస్థితి తెచ్చుకున్నాడు: తెలంగాణ కాంగ్రెస్ నేత మోత్కుపల్లి

Mothkupalli blames YS Jagan for his party defeat
  • చంద్రబాబు ఏపీని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళతారని ఆశాభావం
  • తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, అందులోనే ఉంటానని స్పష్టీకరణ
  • మాదిగలకు రేవంత్ రెడ్డి ఒక్క సీటూ ఇవ్వలేదని విమర్శ
  • పాలన ఎలా చేయాలో రేవంత్ రెడ్డి నేర్చుకోవాలని హితవు
జగన్ తన అహంకారం వల్లే ఈరోజు ఈ పరిస్థితిని తెచ్చుకున్నాడని తెలంగాణ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళతారని ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని... అందులోనే ఉంటానని స్పష్టం చేశారు. తాను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పారు.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని చెప్పింది తానేనని... కానీ మొట్టమొదట ఆయన తమనే రోడ్డున పడేశారని ఆరోపించారు. మాదిగలకు రేవంత్ రెడ్డి ఒక్క సీటూ ఇవ్వలేదని మండిపడ్డారు. పాలన ఎలా చేయాలో రేవంత్ రెడ్డి నేర్చుకోవాలని హితవు పలికారు. తాను ఆరు గంటలు సచివాలయంలో కూర్చున్నప్పటికీ ముఖ్యమంత్రి అపాయింటుమెంట్ ఇవ్వలేదని ఆరోపించారు. తన ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఇంత అవమానం ఎప్పుడూ జరగలేదన్నారు. విలువలు లేని కడియం శ్రీహరిని బీఆర్ఎస్ నమ్మి మోసపోయిందన్నారు.
Mothkupalli Narasimhulu
YS Jagan
Chandrababu
Telangana
Congress

More Telugu News