Telugudesam: రాష్ట్రానికి అనేక అంశాల్లో కేంద్రం మద్దతు అవసరం: టీడీపీ ఎంపీలు

TDP Parliamentary Board Meeting
  • తెలుగు ప్రజల్లో ఉన్న కసి భారీ విజయానికి కారణమని వ్యాఖ్య
  • ఎన్నికలకు ముందు నుంచి ఎన్డీయే కూటమితో ప్రయాణిస్తున్నామన్న ఎంపీలు
  • ఎన్డీయే కూటమికే సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టీకరణ
నరేంద్ర మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల కృషి వల్లే ఏపీలో ఎన్డీయే కూటమికి భారీ విజయం దక్కిందని తెలుగుదేశం పార్టీ ఎంపీలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశం జరిగింది. భేటీ అనంతరం టీడీపీ నుంచి గెలిచిన ఎంపీలు మాట్లాడుతూ... తెలుగు ప్రజల్లో ఉన్న కసి తమ కూటమి భారీ విజయానికి కారణమైందన్నారు. ఎన్నికలకు ముందు నుంచి ఎన్డీయే కూటమితో ప్రయాణిస్తున్నామని తెలిపారు. ఎన్డీయే కూటమికే తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక అంశాల్లో కేంద్రం మద్దతు కావాలన్నారు.
Telugudesam
Andhra Pradesh
Narendra Modi
Chandrababu
Pawan Kalyan

More Telugu News