Narendra Modi: నరేంద్ర మోదీకి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపిన రష్యా అధ్యక్షుడు పుతిన్

Russian President Vladimir Putin phone call to Modi
  • దేశ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం
  • వరుసగా మూడోసారి ప్రధాని కాబోతున్న నరేంద్ర మోదీ
  • మోదీని, భారత ప్రజలను అభినందించిన పుతిన్
వరుసగా మూడోసారి ప్రధానమంత్రి పీఠం అధిష్ఠించబోతున్న నరేంద్ర మోదీకి ప్రపంచ దేశాల నేతల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఫోన్ చేసి మోదీకి శుభాభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పుతిన్ కు కృతజ్ఞతలు తెలుపుతూ మోదీ ట్వీట్ చేశారు. 

"రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ చేసి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా, భారతదేశ ప్రజలు రికార్డు స్థాయిలో సార్వత్రిక ఎన్నికల్లో పాలుపంచుకోవడం పట్ల ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్డీయే విజయాన్ని అభినందించారు. భారత్-రష్యా బంధాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంపై ఇరుదేశాల నిబద్ధతను ఉద్ఘాటించాం" అని మోదీ తన ట్వీట్ లో వివరించారు.


Narendra Modi
Vladimir Putin
India
Russia

More Telugu News