Narendra Modi: ఈ నెల 9న మోదీ ప్రమాణ స్వీకారం... 12న చంద్రబాబు ప్రమాణస్వీకారం!

Chandrababu likely take oath on June 12 as Modi will take oath on June 9
  • నేడు ఢిల్లీలో ముగిసిన ఎన్డీయే సమావేశం
  • ఈ నెల 7న మరోసారి ఎన్డీయే భేటీ 
  • అదే రోజు రాష్ట్రపతిని కలవనున్న ఎన్డీయే పెద్దలు
  • ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని కోరనున్న నేతలు
ఢిల్లీలో నేడు నరేంద్ర మోదీ నాయకత్వంలో జరిగిన ఎన్డీయే సమావేశం ముగిసింది. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. కాగా, ఈ నెల 7న మరోసారి ఎన్డీయే సమావేశం నిర్వహించనున్నారు. 

బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం ఎన్డీయే భేటీ జరగనుంది. ఎన్డీయే సమావేశానికి కూటమి పార్టీల ఎంపీలందరూ హాజరు కావాలని నిర్ణయించారు. ఈ భేటీలో మంత్రివర్గ కూర్పు, శాఖలు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. అదే రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని ఎన్డీయే నేతలు కోరనున్నారు. 

కాగా, ఈ నెల 9న ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. అనంతరం ఈ నెల 12న ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని చంద్రబాబు యోచిస్తున్నారు. చంద్రబాబు ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ కూడా హాజరయ్యే అవకాశాలున్నాయి.
Narendra Modi
Chandrababu
Oath Taking
Prime Minister
Chief Minister
NDA
TDP
Andhra Pradesh
India

More Telugu News