Chandrababu: ఎన్డీయే సమావేశంలో మోదీ పక్కనే చంద్రబాబు... వీడియో ఇదిగో!

Chandrababu chaired beside PM Modi in NDA meet
  • దేశంలో పూర్తయిన సార్వత్రిక ఎన్నికలు
  • మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఎన్డీయే
  • నేడు ఢిల్లీలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం
  • ఎన్డీయే భేటీలో చంద్రబాబుకు విశిష్ట గౌరవం
దేశంలో సార్వత్రిక ఎన్నికలు పూర్తి కాగా, 293 స్థానాలతో ఎన్డీయే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. లాంఛన ప్రాయంగా ఇవాళ ఢిల్లీలో ప్రధాని మోదీ నివాసంలో ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశం జరిగింది.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని బలపరుస్తూ కూటమి నేతలు తీర్మానంపై సంతకాలు చేశారు. కాగా, ఈ సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. చంద్రబాబుకు ఎన్డీయే కూటమిలో విశిష్ట గౌరవం లభించింది. ప్రధాని మోదీకి ఓవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూర్చోగా... మరోవైపు చంద్రబాబు కూర్చున్నారు. 

ఈ భేటీలో చంద్రబాబు ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతూ కనిపించారు. ఈ సమావేశంలో జేడీయూ నేత నితీశ్ కుమార్, కుమారస్వామి, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే తదితరులు పాల్గొన్నారు.
Chandrababu
Narendra Modi
NDA
New Delhi
TDP
Andhra Pradesh

More Telugu News