Victory Venkatesh: ఆల్ ది బెస్ట్ పిఠాపురం ఎమ్మెల్యే గారూ!: పవన్ కు వెంకీ విషెస్

Venkatesh wishes Pawan Kalyan on his victory in Pithapuram
  • పిఠాపురం అసెంబ్లీ స్థానంలో పవన్ కల్యాణ్ విజయం
  • అభినందించిన విక్టరీ వెంకటేశ్
  • మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని అభిలషించిన వెంకీ  
పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో జనసేనాని పవన్ కల్యాణ్ విజయం పట్ల టాలీవుడ్ అగ్ర కథానాయకుడు వెంకటేశ్ స్పందించారు.

"ప్రియమైన పవన్ కల్యాణ్... చారిత్రక విజయం సాధించినందుకు కంగ్రాచ్యులేషన్స్. ఇంతటి ఘన విజయాన్ని అందుకోవడానికి నీకంటే అర్హులెవరూ లేరు మిత్రమా. నువ్వు మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని, ఇకమీదట కూడా నీ కఠోర శ్రమతో, నీ శక్తితో, ప్రజలకు సేవ చేయాలన్న అంకితభావంతో స్ఫూర్తి కలిగిస్తూనే ఉండాలని కోరుకుంటున్నాను" అంటూ వెంకీ ట్వీట్ చేశారు. 

అంతేకాదు... మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను పిఠాపురం ఎమ్మెల్యే గారూ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. వెంకటేశ్, పవన్ కల్యాణ్ గతంలో 'గోపాల గోపాల' అనే చిత్రంలో కలిసి నటించిన సంగతి తెలిసిందే.
Victory Venkatesh
Pawan Kalyan
Pithapuram
Janasena

More Telugu News