Traffic Police: మోటార్ లేని సైకిల్ చూశారా..! ఇదిగో వీడియో

Stopped for challan  man leaves traffic cop baffled with his motorbike bicycle hybrid
  • హెల్మెట్ లేదని చలాన్ వేద్దామనుకొని ద్విచక్ర వాహనదారుడిని ఆపిన ట్రాఫిక్ పోలీసు
  • తాళం లాక్కొని ఫైన్ వేసేందుకు ప్రయత్నం
  • ఇంజన్ తీసేసిన బుల్లెట్ బండిని పెడల్స్ తో సైకిల్ లా తొక్కుతున్నానన్న యువకుడు
  • అవాక్కయిన పోలీసు.. వీడియో వైరల్
మోటార్ సైకిల్ అంటే అందరికీ తెలుసు.. కానీ మీరెప్పుడైనా మోటార్ లేని సైకిల్ ను చూశారా? పంజాబ్ లో ఓ యువకుడి వినూత్న మోటార్ ‘సైకిల్’ నెట్టింట వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది.

ఆ వీడియోలో ఓ యువకుడు రాయల్ ఎన్ ఫీల్డ్ ‘వాహనం’పై వస్తుండగా ఓ ట్రాఫిక్ పోలీసు ఆపాడు. హెల్మెట్ ధరించనందుకు చలాన్ వేద్దామనుకున్నాడు. ముందుగా ఉన్న తాళాన్ని లాగేసుకున్నాడు. అయితే తాను నడుపుతున్నది బండి కాదని సైకిల్ అని ఆ యువకుడు చెప్పడంతో ట్రాఫిక్ పోలీసు అవాక్కయ్యాడు. తాను చూస్తున్నది నిజమా కాదా  అని తెలుసుకొనేందుకు కాస్త కిందకు తొంగిచూశాడు. ఇంకేముంది.. బండికి ఇంజన్ లేకపోవడం చూసి అవాక్కయ్యాడు. బండికి అమర్చిన సైకిల్ పెడల్స్ ను తిప్పి చూసి నోరెళ్లబెట్టాడు. ఇక చేసేదేం లేక ఆ యువకుడిని వెళ్లిపొమ్మన్నాడు. దీంతో అతను సైకిల్ తొక్కుకుంటూ రివ్వున దూసుకెళ్లాడు.

మోజ్ క్లిప్స్ అనే పేరుతో ‘ఎక్స్’లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. ట్రాఫిక్ పోలీసును ఆ యువకుడు భలే బురిడీ కొట్టించాడంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఆ పోలీసు ముఖం మాడిపోయి ఉంటుందని ఓ యూజర్ వ్యాఖ్యానించగా అతని పరిస్థితి ‘మోయ్ మోయ్’ అయిందంటూ మరొకరు చమత్కరించాడు.
Traffic Police
Bullet
Motorcycle
No Engine
Royal Enfield
Punjab
Video
Viral

More Telugu News