Dokka Manikya Varaprasad: తెలంగాణ మాదిరి ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్‌: డొక్కా మాణిక్య‌వ‌ర‌ప్ర‌సాద్‌

Dokka Manikya Varaprasad on Phone tapping in Andhra Pradesh
  • స‌జ్జ‌ల ఆధ్వ‌ర్యంలో ఫోన్ ట్యాపింగ్ జ‌రిగిందన్న టీడీపీ నేత‌
  • ప్ర‌జాప్ర‌తినిధుల ఫోన్లు, వారి వ్య‌క్తిగ‌త సంభాష‌ణ‌లు రికార్డు చేశార‌ని వ్యాఖ్య‌
  • ఫోన్ ట్యాపింగ్ ఆధారంగానే వైసీపీ స‌ర్కార్ బెదిరింపుల‌కు పాల్ప‌డిందని ఆరోప‌ణ‌
  • దీనిపై విచార‌ణ జ‌రపాలి అని డిమాండ్‌
మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్‌ నేత డొక్కా మాణిక్య‌వ‌ర‌ప్ర‌సాద్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. తెలంగాణ మాదిరి ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్ జ‌రిగింద‌ని ఆయ‌న ఆరోపించారు. వైసీపీ నేత స‌జ్జ‌ల ఆధ్వ‌ర్యంలో ఫోన్ ట్యాపింగ్ జ‌రిగిందన్నారు. "స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఆధ్వ‌ర్యంలో ప్ర‌ముఖ నేత‌ల ఫోన్ ట్యాపింగ్ జ‌రిగింది. ప్ర‌జాప్ర‌తినిధుల ఫోన్లు, వారి వ్య‌క్తిగ‌త సంభాష‌ణ‌లు రికార్డు చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఆధారంగానే వైసీపీ స‌ర్కార్ బెదిరింపుల‌కు పాల్ప‌డింది. దీనిపై వెంట‌నే విచార‌ణ జ‌రపాలి" అని డొక్కా మాణిక్య‌వ‌ర‌ప్ర‌సాద్ అన్నారు.
Dokka Manikya Varaprasad
Phone Tapping
Andhra Pradesh
Telangana

More Telugu News