Sai Dharam Tej: ఆనందంతో పవన్‌ను ఎత్తుకున్న సాయి ధ‌ర‌మ్‌తేజ్‌.. వీడియో వైర‌ల్‌!

Sai Dharam Tej Lift Uncle Pawan Kalyan after Grand Victory in Pithapuram
  • వ‌ప‌న్‌ను ఎత్తుకుని మరీ శుభాకాంక్షలు తెలిపిన సాయి ధ‌ర‌మ్‌తేజ్‌ 
  • మీ గెలుపే మా పొగరంటూ మామ విజ‌యాన్ని సెల‌బ్రేట్ చేసుకున్న మెగాహీరో
  • పవన్‌పై ఉన్న ప్రేమను మరోసారి చాటిన మెగా మేన‌ల్లుడు
ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పోటీ చేసిన 21 స్థానాల్లోనూ ఘన విజయం సాధించడంతో కుటుంబసభ్యులు, పార్టీ వర్గాలు, అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. కొందరు నేరుగా, మరికొందరు సోషల్‌ మీడియా వేదికగా జ‌న‌సేనానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఇక మంగ‌ళ‌వారం ఎన్నికల ఫలితాలు వ‌చ్చిన వెంట‌నే పవన్‌ మంగళగిరికి చేరుకున్నారు. ఆయన వెంట హీరో సాయి ధరమ్‌తేజ్‌తో పాటు పవన్ తనయుడు అకీరా నందన్‌ కూడా ఉన్నారు. అయితే మంగళగిరికి చేరుకున్నాక సాయి తేజ్‌ ఉత్సాహంతో తన మేనమామ పవన్‌ను గట్టిగా హత్తుకుని మరోసారి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. 

అనంతరం ఎత్తుకుని మరీ శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను సాయి షేర్ చేస్తూ "మీ గెలుపే మా పొగరు. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ నా హీరో, గురువు" అని పవన్‌పై ఉన్న ప్రేమను మరోసారి చాటుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ‌ వైరల్ అవుతోంది. అభిమానులు, నెటిజన్లు దీనిని తెగ షేర్ చేస్తూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. 

కాగా, ఈ సార్వ‌త్రిక‌ ఎన్నికల్లో పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి 70వేల‌కు పైగా భారీ మెజారిటీతో గెలుపొందడమే కాకుండా, తన పార్టీలో ఉన్నవారందరూ మంచి విజయాన్ని అందుకునేలా జన‌సేన చీఫ్‌ పవన్ క‌ల్యాణ్‌ కృషి చేశారు. దీంతో ఈ విజయానికి సంతోషిస్తూ టాలీవుడ్ స్టార్ హీరోలు కూడా 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఆయ‌న‌కు అభినంద‌న‌లు తెలియజేస్తున్నారు.
Sai Dharam Tej
Pawan Kalyan
Janasena
Pithapuram
Andhra Pradesh

More Telugu News