Naga Babu: జన‌సేనాని విజ‌యంపై నాగబాబు స్పెషల్ పోస్ట్

Naga Babu Tweet on Janaseana Chief Pawan Kalyan Victory in Pithapuram
  • ఏపీ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ అఖండ విజ‌యం
  • పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్ల‌మెంట్ స్థానాల్లోనూ గెలుపు
  • పిఠాపురంలో జ‌న‌సేనానికి రికార్డు స్థాయిలో 70వేల‌కు పైగా మెజారిటీ
  • పిఠాపురం ప్ర‌జ‌ల‌కు నాగ‌బాబు ధ‌న్య‌వాదాలు
ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన పార్టీ అఖండ విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఆ పార్టీ పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 పార్ల‌మెంట్ స్థానాల్లోనూ విజ‌య‌ఢంకా మోగించింది. పిఠాపురంలో జ‌న‌సేనాని రికార్డు స్థాయిలో 70వేల‌కు పైగా మెజారిటీతో గెలుపొందారు. ఇలా జ‌న‌సేనానికి తిరుగులేని విజయాన్ని అందించిన పిఠాపురం ప్ర‌జ‌ల‌కు ఆ పార్టీ నేత నాగ‌బాబు 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న పిఠాపురం ప్రజానీకానికి ఓ లేఖ రాశారు. 

జనసేనాని గెలుపులో భాగమైన పిఠాపురం ప్రజానీకానికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఇంత‌టి విజ‌యాన్ని అందించిన పిఠాపురం ప్ర‌జ‌ల‌ను భుజాల మీద వేసుకుని వారి క‌ష్టానికి ప‌వ‌న్‌ కాపు కాస్తాడ‌ని నాగ‌బాబు తెలిపారు. పిఠాపురం అభివృద్ధికి తోడ్పాటు అందిస్తానంటూ ఆయ‌న చెప్పుకొచ్చారు.
Naga Babu
Janaseana
Pawan Kalyan
Twitter
Andhra Pradesh

More Telugu News