Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్దకు భారీగా చేరుకున్న పోలీసులు

Police security increases at Chandrababu residence in Undavalli
  • ఏపీలో మారిపోయిన రాజకీయ ముఖచిత్రం 
  • తిరుగులేని విజయం దిశగా టీడీపీ కూటమి
  • ఘోర పరాజయం ముంగిట అధికార వైసీపీ
  • చంద్రబాబు నివాసం వద్ద భారీ బందోబస్తు
ఏపీలో కొన్ని గంటల వ్యవధిలోనే రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. కౌంటింగ్ మొదలైన కొన్ని గంటల్లోనే టీడీపీ విజయం పట్ల సందేహాలన్నీ పటాపంచలయ్యాయి. కూటమి పార్టీలు అత్యధిక స్థానాల్లో లీడింగ్ తో దూసుకెళుతున్నాయి. 

ఈ నేపథ్యంలో, ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. చంద్రబాబు నివాసం, పరిసర ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. కూటమి విజయం దాదాపు ఖరారైన నేపథ్యంలో, చంద్రబాబు నివాసం వద్ద పోలీసు బందోబస్తు పెంచడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్ అనంతరం టీడీపీ సొంతంగా 131 స్థానాల్లో లీడింగ్ లో ఉండగా, జనసేన 20, బీజేపీ 7 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. వైసీపీ 17 చోట్ల ఆధిక్యంలో ఉంది.
Chandrababu
Police
TDP
Andhra Pradesh

More Telugu News