Chandrababu: ఏపీలో టీడీపీ ప్రభంజనం... అదిరిపోయే పిక్ పంచుకున్న నారా రోహిత్

Nara Rohit shares a pic of Chandrababu
  • ఏపీలో 130 స్థానాల్లో టీడీపీ ముందంజ
  • 20 స్థానాల్లో జనసేన, 7 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం
  • 18 స్థానాల్లో వైసీపీ లీడ్
  • బాబు ఈజ్ బ్యాక్ అంటూ స్పందించిన నారా రోహిత్
ఏపీలో తెలుగుదేశం పార్టీ హవా మామూలుగా లేదు. సొంతంగా 130 స్థానాల్లో టీడీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ  నేపథ్యంలో, టీడీపీ అధినేత చంద్రబాబు సోదరుడి కుమారుడు, సినీ నటుడు నారా రోహిత్ సోషల్ మీడియాలో ఆసక్తికర ఫొటో పంచుకున్నారు. 

హీరో లెవల్ ఎంట్రీతో చంద్రబాబు కారు దిగుతున్న ఫొటో అది. విదేశీ కంపెనీల ఎగ్జిక్యూటివ్ లు కూడా చంద్రబాబుతో పాటు అదే కారు నుంచి దిగుతుండడం ఆ పిక్ లో చూడొచ్చు. బాబు ఈజ్ బ్యాక్ అంటూ నారా రోహిత్ ఈ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చారు.

కుప్పంలో చంద్రబాబు ముందంజ

టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో ముందంజలో  ఉన్నారు. 6 రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసేసరికి చంద్రబాబు 11,003 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. చంద్రబాబుకు 38,532 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి భరత్ కు 27,529 ఓట్లు వచ్చాయి. కుప్పంలో మరో 12 రౌండ్ల ఓట్ల లెక్కింపు మిగిలుంది.

Chandrababu
Nara Rohith
TDP
Andhra Pradesh

More Telugu News