America's Got Talent: అమెరికా షోలో అదరగొట్టిన కశ్మీర్ బాలిక

Teenager from kashmir stuns spectators at America got talent show
  • అమెరికా హాజ్ గాట్ టాలెంట్ షోలో పాల్గొన్న 13 ఏళ్ల ఆర్షియా శర్మ
  • దెయ్యం డ్యాన్స్ కాన్సెప్ట్ తో శరీరాన్ని రకరకాలుగా మెలితిప్పిన వైనం
  • అవాక్కయిన ప్రేక్షకులు.. అత్యంత భీతిగొల్పిన డ్యాన్స్ ఇదేనన్న జడ్జీలు
అత్యంత ప్రజాదరణ పొందిన అమెరికా హ్యాజ్ గాట్ టాలెంట్ షోలో జమ్మూకశ్మీర్ కు చెందిన 13 ఏళ్ల ఆర్షియా శర్మ అదరగొట్టింది. దెయ్యం డ్యాన్స్ కాన్సెప్ట్ తో అత్యంత కఠినమైన స్టెప్పులు వేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను షో నిర్వాహకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారింది. 

ఆ వీడియోలో షో న్యాయ నిర్ణేతల ముందు ఆర్షియా తనను తాను పరిచయం చేసుకుంది. భారత్ లోని జమ్మూ కశ్మీర్ నుంచి తాను వచ్చినట్లు తెలిపింది. తొలిసారి విదేశీ ప్రయాణం చేశానని చెప్పింది. తాను డ్యాన్సర్ ను అని.. అయితే ఇతరులకు భిన్నమైన టాలెంట్ ను ప్రదర్శించాలనుకుంటున్నట్లు వివరించింది. తన స్టెప్పులకు జిమ్నాస్టిక్స్ ను జోడించబోతున్నట్లు ఆర్షియా తెలిపింది.

డ్యాన్స్ లో భాగంగా ఓ చెక్క పెట్టె వెనక నుంచి దెయ్యం ఆకారంలో కనిపించి ప్రేక్షకులను ఆమె భయపెట్టింది. అనంతరం జిమ్నాస్టిక్స్ ను జోడిస్తూ శరీరాన్ని స్ప్రింగ్ లా కదిలించింది. ఆమె ప్రదర్శించిన భంగిమలను చూసిన వీక్షకులు నోరెళ్లబెట్టి చూస్తుండిపోయారు. ఆమె ప్రదర్శన అనంతరం జడ్జీలు సహా అందరూ లేచి నిలబడి మరీ చప్పట్లు కొట్టారు. అత్యంత కఠినమైన, భీతిగొల్పిన డ్యాన్స్ ఇదేనని జడ్జీలు పేర్కొన్నారు.
America's Got Talent
Show
Indian girl
Arshia Sharma
Stuns
Spectators
viral
Video

More Telugu News