Hardik Pandya: కలిసిపోయిన హార్దిక్ పాండ్యా-నటాషా.. కావాలంటే ఇది చూడండి!

Natasa restores wedding images with Hardik Pandya amid separation rumours
  • పాండ్యా-నటాషా విడిపోతున్నట్టు వార్తలు
  • నటి దిశా పటానీ బాయ్‌ఫ్రెండ్‌తో కనిపించిన నటాషా
  • భార్యకు 70 శాతం ఆస్తిని పాండ్యా ట్రాన్స్‌ఫర్ చేశాడంటూ పుకార్లు
  • వెడ్డింగ్ ఫొటోలను రీస్టోర్ చేసి పుకార్లకు తెరదించిన నటాషా
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా-నటాషా స్టాంకోవిక్ దంపతులు విడిపోయారంటూ గత కొన్ని రోజులుగా ఒకటే రూమర్లు. ఈ పుకార్లకు కారణం కూడా ఉంది. తన ఇన్‌స్టా ఖాతా నుంచి తమ వెడ్డింగ్ ఫొటోలను, తన పేరు నుంచి పాండ్యా అన్న సర్‌నేమ్‌ను నటాషా తొలగించడమే అందుకు కారణం.

ఆ తర్వాత నటాషా.. బాలీవుడ్ ప్రముఖ నటి దిశా పటానీ బాయ్‌ఫ్రెండ్‌తో బహిరంగంగా కనిపించడంతో ఈ రూమర్లకు మరింత బలం చేకూరింది. ఐపీఎల్‌లో పాండ్యా ముంబైకి సారథ్యం వహించినప్పటికీ ఒక్కసారి కూడా స్టాండ్స్‌లో కనిపించకపోవడం.. ఇలా వరుస ఘటనలు ఈ రూమర్లు నిజమనుకునేలా చేశాయి.

దీనికితోడు ఈ వార్తలపై అటు పాండ్యా కానీ, ఇటు నటాషా కానీ బహిరంగంగా స్పందించకపోవడంతో అభిమానులు ఓ నిర్ణయానికి వచ్చేశారు. ఇదొక్కటే కాదు.. హార్దిక్ తన నికర ఆస్తిలో దాదాపు 70 శాతం వాటాను భార్యకు బదిలీ చేశాడన్న వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. 

తాజాగా, నటాషా ఈ రూమర్లు అన్నింటికీ చెక్ పెడుతూ.. తమ పెళ్లి ఫొటోలను తిరిగి ఇన్‌స్టాలో రీస్టోర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. దాదాపు ఐదు రోజుల క్రితం బాంద్రా-వోర్లి సీ లింక్‌పై నుంచి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్ సిరీస్‌లో పోస్టు చేసిన ఈ సెర్బియన్ మోడల్..  ‘దేవుడిని ప్రశంసించండి’ అని రాస్తూ ఎమోజీలు జోడించింది. అంతకుముందు మరో పోస్టులో.. ‘ఎవరో వీధుల్లోకి రాబోతున్నారు’ అని గుంభనంగా రాసుకొచ్చింది. తాజాగా, ఇప్పుడు తమ పెళ్లి ఫొటోలను సోషల్ మీడియా ఖాతాలో రీస్టోర్ చేసిన నటాషా రూమర్లకు తెరదించింది.
Hardik Pandya
Natasa Stankovic
Separation
Crime News
Hardik Pandya Wedding

More Telugu News